Home ప్రత్యేకం ‘ఆదిపురుష్‌’ నుంచి భారీ సర్‌ ప్రైజ్...ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్

‘ఆదిపురుష్‌’ నుంచి భారీ సర్‌ ప్రైజ్…ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్

‘ఆదిపురుష్‌’ సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాముడు పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్‌ , రావణుడి ప్రాతలో సైఫ్‌ అలీఖాన్‌  నటిస్తున్నారు. బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదిపురుష్‌ నుంచి అప్‌ డేట్‌ ఉంటుందని చిత్రయూనిట్‌ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. బుధవారం ఉదయం 7గంటల11నిమిషాలకు ఈ సర్‌ ప్రైజ్‌ ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

కాగా, దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని మోషన్‌ క్యాప్చర్‌ షూట్‌ మొదలైంది. ఇది ఈ విజువల్ వండర్ లో అతి కీలకంగా తెరకెక్కిస్తున్నారు. కేవలం ఈ పార్ట్ కోసమే రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నారట చిత్రబృందం. టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్,  ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, ఓం రౌత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేసి తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా ఈ చిత్రాన్ని  విడుదల చేయనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు