Home ప్రత్యేకం 'ఆచార్య': ష‌డ్రుచుల స‌మ్మేళ‌నం.. సిద్దా, నీలంబ‌రిల ప్రేమ‌

‘ఆచార్య’: ష‌డ్రుచుల స‌మ్మేళ‌నం.. సిద్దా, నీలంబ‌రిల ప్రేమ‌

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కతున్నసినిమా ఆచార్య. ఇందులో రామ్‌చరణ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తండ్రీ తనయుల కాంబినేషన్‌లో కీలకమైన సన్నివేశాలను సింగరేణి ప్రాంతంలో చిత్రీకరించారు. చిరంజీవి సరసన కాజల్‌ నటిస్తుండగా, రామ్‌చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు.

తాజాగా ఉగాది పండగ సంద‌ర్భంగా సినిమా నుండి రామ్ చ‌ర‌ణ్‌, పూజాల పోస్ట‌ర్ ఒక‌టి విడుద‌ల చేశారు చిత్రబృందం. ఈ పోస్ట‌ర్‌కు “షడ్రుచుల సమ్మేళనం… సిద్దా, నీలాంబరిల ప్రేమ” అంటూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కాగా, భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మెగా అభిమానులతోపాటు ప్రేక్షకుల్లోనూ అంతకంతకూ ఆసక్తిని పెంచుతోంది. ఇక కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. మే 13న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు