Home ప్రత్యేకం 'ఆచార్య' విడుదలపై క్లారిటీ ఇచ్చిన కొర‌టాల!

‘ఆచార్య’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన కొర‌టాల!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కారణంగా పలు సినిమాలు విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. అయితే మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కూడా ఇదే వాయిదా పడినట్టు గతకొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా టెన్షన్‌తో మెగా అభిమానులందరు థియేటర్‌కు వచ్చే అవకాశాలు లేకపోవచ్చని, కాబట్టి వాయిదా వేయడమే మంచిదని అనుకుంటున్నట్లు సమాచారం.

అయితే తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ కొర‌టాల శివ ఈ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఆగ‌స్టులో విడుద‌లకు సిద్ధంగా ఉండాల‌ని సూచించిన‌ట్టు టాక్‌ వినిపిస్తోంది. దీనిపై మే చివ‌ర‌లో చిత్రబృందం విడుద‌ల తేదీ పై ఓ ప్ర‌క‌ట‌న చేస్తార‌ని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కాగా ‘ఆచార్య’లో మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. చిరుకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌, చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. సోనూసూద్‌ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు