Home ప్రత్యేకం 'ఆచార్య' నుంచి అదిరిపోయే సాంగ్ లీక్..!

‘ఆచార్య’ నుంచి అదిరిపోయే సాంగ్ లీక్..!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. నిరంజన్‌  రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నిర్మించడంతో పాటు సిద్ధ అనే ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌. ఇతడికి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో ముఖ్యంగా మణిశర్మ ఇస్తున్న మ్యూజిక్ ట్రీట్ కోసం కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అలా ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘లాహే లాహే’ కూడా మంచి హిట్ అయ్యింది. ఇదిలాఉంటే.. ఈ సినిమాలోని మరో అదిరిపోయే సాంగ్ ప్రోమో లీక్ అయ్యినట్టుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇది రామ్ చరణ్, పూజాలపై ప్లాన్ చేసిన రొమాంటిక్ సాంగ్ నీలాంబరి అని తెలుస్తుంది. దీనితో ఇది విన్న అభిమానులు ఆ సాంగ్ ను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు. కాగా, మే 13న ‘ఆచార్య’ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు