Home ప్రత్యేకం 'ఆచార్య' కళ్లు చెదిరే బిజినెస్.. రికార్డులు తిరగరాస్తున్న మెగాస్టార్, మెగాపవర్ స్టార్!

‘ఆచార్య’ కళ్లు చెదిరే బిజినెస్.. రికార్డులు తిరగరాస్తున్న మెగాస్టార్, మెగాపవర్ స్టార్!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆచార్య’ విడుదలకు ముందే సెన్సేషన్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు ఎప్పటికప్పుడు దర్శకుడు కొరటాల శివ వదులుతున్న అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి చూపు ‘ఆచార్య’ విడుదలపైనే పడింది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

‘ఆచార్య’ మూవీకి సంబంధించి బిజినెస్ డీల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయని తెలుస్తోంది. నైజాం ఏరియా రైట్స్ ను వరంగల్ శ్రీను రూ.42 కోట్లకు  కొనుగోలు చేశాడని సమాచారం. ఇక ఆంధ్రా, సీడెడ్ రైట్స్ రూ.62 అమ్ముడయ్యాయని సమాచారం. అలాగే ఆచార్య ఓవర్సీస్ రైట్స్ ను దాదాపుగా రూ.20 కోట్లకు కొనుగోలు చేశారట. ఇక ఈ చిత్రం ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి బిజినెస్ ను చేసినట్లుగా సమాచారం అందుతోంది. అన్ని ఏరియాల్లో కలిపి ఆచార్య సినిమా భారీ మొత్తంలో బిజినెస్ అయ్యిందట. నైజాం.. ఓవర్సీస్.. ఆంద్రా.. సీడెడ్ ఇతర రాష్ట్రాల్లో కలిపి 140 కోట్లకు పైగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ చేసినట్లుగా సమాచారం. కాగా, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు రూ.150 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు