Home ప్రత్యేకం 'ఆచార్య' ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: రామ్ చ‌ర‌ణ్‌, సోనూసూద్ మధ్య భీక‌ర ఫైట్‌

‘ఆచార్య’ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: రామ్ చ‌ర‌ణ్‌, సోనూసూద్ మధ్య భీక‌ర ఫైట్‌

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్ పాత్రలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై ఆయన తనయుడు రామ్‌చరణ్‌‌ నిర్మిస్తూ ‘సిద్ధ’అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ‘ఆచార్య’ సినిమా కోసం ధర్మస్థలి విలేజ్‌ సెట్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో చిత్రబృందం తయారు చేయించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఆ సెట్‌లోనే జరుగుతోంది.

అయితే తాజా షెడ్యూల్‌లో రామ్ చ‌ర‌ణ్‌, సోనూసూద్ మధ్య భారీ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారట కొర‌టాల శివ. రైన్ ఫైట్‌గా భారీ యాక్ష‌న్ విజువ‌ల్స్ తో కొర‌టాల ఈ ఫైట్‌ను రూపొందిస్తున్నారని సమాచారం. కాగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా నటి కాజల్‌ చిరంజీవికి జోడీగా నటిస్తోంది. అలాగే పూజాహెగ్డే చరణ్‌కు జోడిగా నటిస్తోంది. ఇక మే 13న ‘ఆచార్య’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు