Home ప్రత్యేకం 'ఆచార్య’: ఇంటర్వెల్ లో ఎంట్రీ ఇచ్చి కథను మలుపుతిప్పనున్న పూజా హెగ్డే!

‘ఆచార్య’: ఇంటర్వెల్ లో ఎంట్రీ ఇచ్చి కథను మలుపుతిప్పనున్న పూజా హెగ్డే!

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్‌ నటిస్తుంది. రామ్‌ చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కామ్రేడ్‌ ‘సిద్ధ’గా కనిపించనున్నారాయన. ఈ చిత్రంలో చెర్రీకి జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే సందడి చేయనుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

కాగా, ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. సినిమాలో పూజా ఎంట్రీ ఇంటర్వెల్ సీన్స్ లోనే ఉంటుందని.. అంటే ఆచార్య ఇంటర్వెల్ కి చరణ్ చెప్పే ప్లాష్ బ్యాక్ లో పూజా కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. దేవాదాయ శాఖలో జరిగే అన్యాయాల ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే సినిమాలో రామ్ చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరంజీవి పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే విడుదలైన టీజర్‌, లాహే లాహే పాట సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు