మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న రామ్‌చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఆచార్యగా చిరంజీవి, సిద్ధ పాత్రలో రామ్‌చరణ్ అలరించనున్నారు. కాగా, ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే పూజా హెగ్డే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసింది. అయితే తాజాగా ఆమె పాత్ర గురించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
‘ఆచార్య’ సినిమాలో పూజా హెగ్డే పాత్ర సుమారు 20 నిమిషాల పాటు ఉంటుందట. సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ తో కలిసి కనిపిస్తుందని.. ఇద్దరి కాంబినేషన్లో ఓ సాంగ్ కూడా ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా పూజా పాత్ర ఫుల్ ఎమోషనల్ గా సాగుతుందని.. ఆమె పాత్ర అర్థాంతరంగా మరణిస్తుందని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవాదాయశాఖ నేపథ్యంగా సాగే ఈ చిత్రం మే 13 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.