Home ప్రత్యేకం 'ఆచార్య'తో బాక్సాఫీసు రికార్డులు బద్దలవడం ఖాయం: రామజోగయ్య శాస్త్రి

‘ఆచార్య’తో బాక్సాఫీసు రికార్డులు బద్దలవడం ఖాయం: రామజోగయ్య శాస్త్రి

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్‌ అగర్వాల్‌, చరణ్‌కు జోడీగా పూజాహెగ్డే నటించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. కాగా, ఈ చిత్రం విడులయ్యాక బాక్సఫీసు రికార్డులు బద్దలుకొడుతుందని ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. ఇటీవలే  ఈసినిమా నుంచి విడుదలైన ‘లాహే లాహే’ సాంగ్  యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ..” మెగాస్టార్ చిరంజీవి సినిమాకి ఓ పాట రాయాలనే కోరిక నాలో ఎప్పటి నుంచో ఉంది. ‘ఖైదీ నం:150’లో ‘రైతన్న’ పాట రాశాను. కానీ ఆయన స్టామినాకు తగ్గట్టు పాట రాయాలనే కోరిక నాకు అలాగే మిగిలింది. ఈ క్రమంలోనే  ఆచార్య చిత్రంతో  చిరంజీవి గారికి రెండో పాట రాసే ఓ అద్భుత అవకాశం ఈ పాటతో దక్కింది.  ‘లాహే లాహే’  పాట విన్న తరువాత చిరంజీవి నాకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సినిమా రిలీజ్ అయ్యాక  తప్పకుండా బాక్సఫీసు రికార్డులు బద్దలు కొడుతోంది” అని ఆయన అన్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు