Home ప్రత్యేకం అల్లు అర్జున్ బర్త్ డే: 'తగ్గేదే లే’ అంటున్న చిరంజీవి.. వైరల్ ట్వీట్

అల్లు అర్జున్ బర్త్ డే: ‘తగ్గేదే లే’ అంటున్న చిరంజీవి.. వైరల్ ట్వీట్

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌  నటిస్తోన్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ అనే లారీ డ్రైవర్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 13న  విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తుండ‌గా, తాజాగా అల్లు అర్జున్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టీజ‌ర్ విడుద‌ల చేశారు. పుష్ప‌రాజ్‌గా టీజ‌ర్‌లో దుమ్మురేపాడు బ‌న్నీ. ఇది చూసిన ప్ర‌తి ఒక్క‌రు బ‌న్నీ ఇక త‌గ్గేదే లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం త‌న ట్విట్ట‌ర్ ద్వారా బ‌న్నీకు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ..  ఓ ట్వీట్‌ చేశారు.

” ఇప్పుడే పుష్ప’ టీజర్ చూశాను. బన్నీ లుక్ ఊరమాస్‌గా ఉంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ తగ్గేదే లే.. నా ప్రియమైన బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు. కాగా, ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు చిత్తూరు యాసలో డైలాగ్స్‌ చెబుతారట. ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో బన్నీ పాత్ర రఫ్‌గా ఉండబోతుంది. ఈ సినిమా టీజర్ లోను బన్నీ పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌గా మాస్‌ లుక్‌లో కనిపించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుంది.  హీరో కూలీ నుంచి స్మగ్లర్‌గా ఎలా మారాడన్నదే కథ.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు