‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్–దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఎర్రచందనం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ ఇప్పుడు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ల్యూడ్ ఎప్రిల్ 3న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ప్రీ ల్యూడ్ అంటే ముందుమాట అని అర్థం. దీనికి సంబంధించిన పోస్టర్ తాజాగా విడుదల చేసారు మేకర్స్. ఆ రోజు పుష్ప సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ కూడా బయటికి రానున్నాయి.
ముఖ్యంగా టీజర్ అప్ డేట్ కూడా అదే రోజు రానుందని తెలుస్తోంది. బన్నీ బర్త్ డే రోజైన ఎప్రిల్ 8న విడుదల చేయాలని చూస్తున్నారు. అందుకే పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ కు పుష్ప టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు చిత్రబృందం. కాగా, ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు చిత్తూరు యాసలో డైలాగ్స్ చెబుతారట. ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బన్నీ పాత్ర రఫ్‌గా ఉండబోతుంది. ఈ సినిమా పోస్టర్లోనూ బన్నీ పుష్పరాజ్ అనే స్మగ్లర్‌గా మాస్ లుక్‌లో కనిపించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా సాగుతుంది. హీరో కూలీ నుంచి స్మగ్లర్‌గా ఎలా మారాడన్నదే కథ. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు.