Home ప్రత్యేకం అల్లు అర్జున్-ప్రశాంత్‌ నీల్ మూవీ ఇంట్రస్టింగ్ అప్‌డేట్!

అల్లు అర్జున్-ప్రశాంత్‌ నీల్ మూవీ ఇంట్రస్టింగ్ అప్‌డేట్!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా ‘పుష్ప’. ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం కావడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప సినిమాలో స్మగ్లర్‌ పుష్పరాజ్‌ పాత్రలో అల్లుఅర్జున్‌ కనిపించనున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. షరవేగంగా షూటింగ్‌ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ‘కేజీయఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తోన్నాయి. ప్రశాంత్‌ ప్రస్తుతం ‘కె.జి.యఫ్‌2’తో పాటు ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’ని తెరకెక్కిస్తున్నారు. సినిమా ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఆ వెంటనే జనవరిలోనే బన్నీ సినిమాని ప్రశాంత్‌ పట్టాలెక్కించేందుకు సన్నహాలు చేస్తున్నారట. కొన్ని రోజుల క్రితం ప్రశాంత్ నీల్ హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్‌ని కలిసిన సంగతి తెలిసిందే. దింతో వీరిద్దరి కాంబోలో ఎలాంటి మూవీ వస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు