Home ప్రత్యేకం అల్లు అర్జున్ పై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్ పై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్ అగ్రకథానాయకుడుగా ఎదుగడంలో నిర్మాత ముఖ్య పాత్ర పోషించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బన్నీకి సరైన హిట్ లేని సమయంలో కొత్త దర్శకుడైన సుకుమార్‌ను నమ్మి మంచి బడ్జెట్లో, రాజీ లేకుండా ఆర్య సినిమాను నిర్మించాడు దిల్ రాజు. ఆ సినిమాతో ఈ ఇద్దరు మంచి స్టార్లుగా ఎదిగారు. అనంతరం అల్లు అర్జున్ తో.. పరుగు, దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాలు తీశాడు రాజు. తన కెరీర్ ఎదుగుదల తాలూకు క్రెడిట్‌ను సుకుమార్‌కు ఎంత ఇస్తాడో రాజుకు కూడా అంతే ఇవ్వాలి బన్నీ. అయితే ఈ మధ్య అల్లు తనను ఇబ్బంది పెడుతుండటం పట్ల దిల్ రాజు కొంత అసంతృప్తితో ఉన్నాడన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇదిలాఉంటే.. బన్నీ-దిల్‌రాజు కాంబోలో ఓ సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, వెల్లడించారు. ఈ సినిమాకి ‘ఐకాన్’‌ అనే  టైటిల్‌ను కూడా అనౌన్స్‌ చేసేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం పుష్ప మూవీలో అల్లు అర్జున్‌ బిజీగా ఉండగా, డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌ వకీల్‌సాబ్‌ తో బిజీ అయిపోయారు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్‌ రాజ్‌ ఐకాన్‌పై వస్తున్న వార్తలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ ఐకాన్‌ ఉండబోతుందని, త్వరలోనే షూటింగ్‌ కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రపై మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అంతేకాకుండా అల్లు అర్జున్ కు ఐకాన్‌ స్టార్‌ అనే టైటిల్‌ను తాము పెట్టలేదని, తనకు తాను పెట్టుకున్నట్లు చెప్పారు.  దీంతో ఈ సినిమాలో బన్నీ నటించడం లేదని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు