Home సినిమాలు అల్లు అర్జున్ 'పుష్ప'లో రష్మిక పాత్ర ఇదే..!!

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో రెండవ షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక తదుపరి షెడ్యూల్‌ కోసం అల్లు అర్జున్‌ ఇటీవల కేరళకు పయనమయ్యాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కేరళ అడువుల్లో మూడవ షెడ్యూల్‌ను జరుపుకొంటోంది. కొన్ని వారాల పాటు కేరళలో జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్‌లో అక్కడి అడవుల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. 

కాగా ఇందులో కథానాయికగా రష్మికా మండన్న నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీ రష్మిక పాత్రలు అద్భుతంగా ఉంటాయట. ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా డిజైన్ చేశాడట సుకుమార్. అయితే.. ఇందులో బన్నీ లుక్ ఏవిధంగా ఉంటుందో తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్ ఫోటోలు బయటకు వచ్చాయి. మాసిన జుట్టు గడ్డంతో మొరటు వ్యక్తిలా కనిపిస్తున్నాడు బన్నీ. మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిన ఈ పిక్స్.. సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే.. ఇప్పుడు రష్మిక పాత్రకు సంబంధించిన వివరాలు కూడా లీకయ్యాయి.

పుష్ప సినిమా ఆన్ లొకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఈ ఫొటోస్ లో అంత డీగ్లామరస్ గా లేదు రష్మిక. ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా కనిపిస్తోంది. మరి ఇలాంటి అమ్మాయిని ఎర్ర చందనం దుంగలు స్మగ్లింగ్ చేసే బన్నీకి ఎలా కనెక్ట్ అయింది అన్నది చూడాలి. ఇక పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌ తొలిసారిగా పూర్తిస్థాయి మాస్‌ రోల్‌లో మెప్పించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంసెట్టి మీడియా సంయుక్తం నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు