Home సినిమాలు అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. అది ఐకాన్‌ స్టార్‌కి మాత్రమే సాధ్యం!

అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. అది ఐకాన్‌ స్టార్‌కి మాత్రమే సాధ్యం!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ ‘‘అల వైకుంఠపురములో’ సినిమా ఏన్నో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసి, పలు సంచలన రికార్డులను సొం‍తం చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టాయి. అయితే తాజాగా అలా వైకుంఠపురములో ఆల్బమ్ ఇప్పుడు 2 బిలియ‌న్ వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసి ద‌క్షిణాది సినిమాల్లో ఎవరికి సాధ్యం కాని విధంగా సరికొత్త రికార్డు సాధించినట్టు స‌మాచారం. ఇప్ప‌టికే అనేక రికార్డులు సృష్టించిన అల వైకుంఠ‌పుర‌ములో తాజాగా ఈ రికార్డ్ సాధించ‌డం ప‌ట్ల స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటిస్తున్నాడు. పుష్ప చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల అవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. బన్నీ సరసన రష్మిక సందడి చేయనుంది. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు