Home సినిమాలు అల్లు అర్జున్, కొరటాల మూవీపై వచ్చిన క్లారిటీ!

అల్లు అర్జున్, కొరటాల మూవీపై వచ్చిన క్లారిటీ!

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో..జీఏ 2, యువసుధ ఆర్ట్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మాణంలో బన్నీ హీరోగా ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది.
కానీ ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కొరటాల శివ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో కొరటాల, అల్లు అర్జున్‌ కాంబోలో   సినిమా ఆగిపోయిందనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ – కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ..2022 ఏప్రిల్‌లో మొదలు కానుందంటూ నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ప్రకటించాడు. ఆ సమయానికి ఎన్టీఆర్ – కొరటాల ప్రాజెక్ట్ పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నారట.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు