Home ప్రత్యేకం అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌…ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్ పైగా లైకులు సంపాదించి దూసుకుపోతోంది. కాగా, ప్రస్తుతం పుష్ప షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘పుష్ప’కు సంబంధించి ఓ  వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
వాస్తవానికి ‘పుష్ప’ చిత్రం ఈ ఏడాది ఆగష్టు 13న విడుదల కావాల్సి ఉంది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ నాలుగు నెలలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్‌ ఆలస్యంకావడంతో చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరిపి, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి నాలుగు నెలల తర్వాత.. అంటే ‘పుష్ప’ ను డిసెంబర్‌ 17న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాగా, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు