Home సినిమాలు అల్లు అర్జున్‌పై పొగడ్తల వర్షం కురిపించిన సల్మాన్‌ఖాన్‌!

అల్లు అర్జున్‌పై పొగడ్తల వర్షం కురిపించిన సల్మాన్‌ఖాన్‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు బాలీవుడ్‌ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్‌ ధన్యవాదాలు తెలిపాడు. సల్మాన్‌ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే’ మూవీలో బన్నీ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’లోని ‘సీటీమార్‌’ సాంగ్ ను వాడుకున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో సాంగ్‌ని సోమవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌‌ డ్యాన్స్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా హుషారుగా చిందులేశాడు. ఇందులో పూజా హెగ్డే పాత్రలో దిశాపటానీ స్టెప్పులేసింది.

ఈ సందర్భంగా సిటీమార్‌ ఒరిజినల్‌ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన అల్లు అర్జున్‌పై సల్మాన్ ఖాన్ పొగడ్తల వర్షం కురిపించాడు ‘సిటీమార్‌లో మీ డాన్స్ చాలా బాగా నచ్చింది. మీ స్టెప్స్, స్టైల్‌.. ప్రతీది ఫెంటాస్టిక్‌ అసలు.. లవ్‌ యూ బ్రదర్..’‌ అని ట్వీట్‌ చేశాడు. ఇది చూసిన అల్లు అర్జున్ కూడా ‘థ్యాంక్‌ యూ సోమచ్‌ సల్మాన్‌ గారు’ అంటూ రిప్లై ఇచ్చాడు. ‘మీ నుంచి కాంప్లిమెంట్‌ వచ్చినందుకు సంతోషంగా ఉంది. స్క్రీన్‌ మీద రాధే మ్యాజిక్‌ కోసం ఎదురు చూస్తున్నాను. మీ ప్రేమకు కృతజ్ఞతలు..’ అని పేర్కొన్నాడు. కాగా, ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 13న విడుదల కానుంది. థియేటర్లతో పాటు ‘పే పర్‌ వ్యూ’ పద్ధతిలో జీ ప్లెక్స్‌, డిష్‌ టీవీ, డీటుహెచ్‌, టాటా స్కై, ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీల్లోనూ ‘రాధే’ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు