Home ప్రత్యేకం అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్‌.. ఊహించని షాక్ లో ఐకాన్ స్టార్ అభిమానులు!

అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్‌.. ఊహించని షాక్ లో ఐకాన్ స్టార్ అభిమానులు!

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డాడు. తాజా పరీక్షల్లో అతడికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. ఈ విష‌యాన్ని బన్నీ త‌న సోషల్ ట్విట్టర్ ద్వారా తెలియ‌జేశారు.  “నేను ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో ఉంటూ క‌రోనాకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నాను. గ‌త కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారందరూ కరోనా ప‌రీక్ష‌లు చేయించుకోండి. ఇంట్లోనే సుర‌క్షితంగా ఉంటూ, వీలున్న‌ప్పుడు వ్యాక్సిన్ చేయించుకోండి. ప్రస్తుతానికి నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని కోరుతున్నాను” అని అల్లు అర్జున్ ట్వీట్‌ చేశారు.
ఇక మరోవైపు అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని సరసన హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఫహద్‌ ఫాజిల్‌ విలన్ గా కనిపించనున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్ తో సుకుమార్ రూపొందిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు