Home ప్రత్యేకం అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం.. ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా రికార్డ్

అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం.. ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా రికార్డ్

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ 38వ పుట్టినరోజును జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌ ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే బన్నీ బర్త్ డే వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి మీద లేజర్‌, లైట్‌ షో ఉంటుందని ‘పుష్ప’ చిత్రబృందం ప్రకటించింది. ఈరోజు రాత్రి 7- 8.30 గంటల మధ్య ఈ స్పెషల్‌ షో ఉంటుందని వెల్లడించింది. తెలుగు సినీ చరిత్రలో ఏ హీరోకు దక్కని ఈ అరుదైన గౌరవం బన్నీకి దక్కడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత బన్నీ, సుకుమార్‌ కాంబోలో వస్తున్న చిత్రం కాబట్టి ‘పుష్ప’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు‌. రష్మికా మందన్నా కథానాయిక. ఫాహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు‌. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప’ ఆగస్టు 13న విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు