Home ప్రత్యేకం అల్లు అయాన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. బన్నీ భావోద్వేగ ట్వీట్..!

అల్లు అయాన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. బన్నీ భావోద్వేగ ట్వీట్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ఇవాళ ఏడవ పుట్టినరోజును జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఇంట్లో అయాన్ పుట్టినరోజు వేడుకలను చేసిన బన్నీ.. సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ ట్వీట్‌ను ఆయన పెట్టారు. ‘మేనీ మేనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్‌ ది డే మై స్వీట్‌ బేబీ బాబు ఆయాన్‌. నీకు ఇంకా ఎన్నో అందమైన సంవత్సరాలు రావాలని  కోరుకుంటున్నాను. లవ్‌ యూ నాన్న’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్‌ చేశాడు.

కాగా, బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ మూవీపై భారీగానే అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో బన్నీ లుక్‌ ఆకట్టుకుంటోంది. అయితే బన్నీ ఫ్యాన్‌కు ఓ స్పెషల్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజుకు ముందే అభిమానులకు భారీ సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఏప్రిల్ 7న సాయంత్రం 6.12 గంటలకు సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ వీడియోను విడుదల చేయనున్నారు మేకర్స్.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు