Home ప్రత్యేకం అలాంటి పాత్ర వస్తే కథ వినకుండానే ఒప్పేసుకుంటా: రామ్‌చరణ్‌

అలాంటి పాత్ర వస్తే కథ వినకుండానే ఒప్పేసుకుంటా: రామ్‌చరణ్‌

శాంతి భద్రతల పరిరక్షణలో అనునిత్యం శ్రమిస్తున్న పోలీసులకు మనస్ఫూర్తిగా నా సెల్యూట్‌ అన్నారు ప్రముఖ సినీ నటుడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌.పోలీస్‌ ప్రాధాన్యమున్న సినిమా అయితే.. కథ వినకుండానే ఒప్పేసుకుంటానని రామ్‌చరణ్‌ అన్నారు. పోలీస్‌ పాత్రలో నటించడం అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు.మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో స్పోర్ట్స్‌ మీట్‌ ముగింపునకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ధ్రువ సినిమాలో ఐపీఎస్‌ ఆఫీసర్‌గా నటించేందుకు చాలా కష్ట పడ్డానని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోనూ పోలీస్‌ పాత్రలో నటిస్తున్నానని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

అనంతరం సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌కు పిలవగానే విచ్చేసిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్లాస్మా దానం కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మెగాస్టార్‌ చిరంజీవి తమతో కలిసి వచ్చారన్నారు. ఆయనకు సీపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు విజయ్‌కుమార్‌, ప్రకాశ్‌రెడ్డి, పద్మజ, వెంకటేశ్వర్లు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత అథ్లెట్‌ కోచ్‌ నాగపూరి రమేశ్‌ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు