Home ప్రత్యేకం అమెరికాలో 'వకీల్ సాబ్' కలెక్షన్ల ప్రభంజనం..

అమెరికాలో ‘వకీల్ సాబ్’ కలెక్షన్ల ప్రభంజనం..

పవర్ స్టార్  పవన్‌ కల్యాణ్ టైటిల్ పాత్రలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌సాబ్’. శ్రుతిహాసన్‌ హీరోయిన్. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. బోనీ కపూర్ సమర్పణలో వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాంకపై దిల్‌రాజ్‌ నిర్మించారు. ఏప్రిల్‌ 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. అమెరికాలో బుధవారం ఒక్కరోజే 117 ప్రాంతాల్లో 8,311 డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా 7,10,952 డాలర్లు రాబట్టింది.
కాగా, పింక్ సినిమా కథను పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్లు మార్చి అద్భుతంగా తీర్చిదిద్ధాడు శ్రీరామ్ వేణు. పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు బయటి ఫ్యాన్స్ కూడా వకీల్ సాబ్ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఇదిలాఉంటే.. ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానుందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ…‘‘వకీల్ సాబ్ పై వస్తున్న వార్తలు పక్కన పెట్టండి. ‘వకీల్‌సాబ్‌’ని థియేటర్లలో మాత్రమే చూడండి’’అంటూ వెల్లడించింది. ‘‘దయ చేసి పుకార్లు నమ్మొద్దు. వెండితెరపై వకీల్‌సాబ్‌ చూడండి. ప్రస్తుతానికి ఏ ఓటీటీలోనూ సినిమాను విడుదల చేసే ఆలోచనే లేదు’’ అని చిత్ర యూనిట్ ప్రకటించింది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు