Home సినిమాలు అమెజాన్ ప్రైమ్‌‌లో 'వకీల్ సాబ్'.. రిలీజ్ డేట్ ఫిక్స్

అమెజాన్ ప్రైమ్‌‌లో ‘వకీల్ సాబ్’.. రిలీజ్ డేట్ ఫిక్స్

అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ కీలక పాత్రలో వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రాన్ని తెలుగులో ‘వకీల్‌సాబ్‌’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. హిందీ, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్‌’పై భారీ అంచనాలే ఉన్నాయి. తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘వకీల్‌సాబ్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమాకు ఓటీటీ డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో భారీ రేటుకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు సమాచారం. అయితే థియేటర్లలో 50 రోజులు ఆడిన తర్వాతే ఓటీటీలో ప్రసారం చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. అంటే మే నెలాఖరులో వకీల్‌ సాబ్‌ అమెజాన్‌లో ప్రసారం కానుందన్నమాట. ఇక ఇదివరకే దీని శాటిలైట్‌ హక్కులను జీ తెలుగు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో నివేదా థామస్‌, అంజలి, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాట, టీజర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు..’ అంటూ సినిమాలో వినోదం ఏ స్థాయిలో ఉండబోతోందన్నది రుచి చూపించారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు