Home ప్రత్యేకం అభిమానులకు ఊహించని షాకిచ్చిన‌ ‘ఆచార్య’.. మరీ అన్ని రోజులా?

అభిమానులకు ఊహించని షాకిచ్చిన‌ ‘ఆచార్య’.. మరీ అన్ని రోజులా?

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్ పాత్రలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్‌‌ ‘సిద్ధ’అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా నటి కాజల్‌ మెగాస్టార్ సరసన నటిస్తోంది. చెర్రీ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మే 13న ‘ఆచార్య’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది.
ఇదిలాఉంటే.. ఆచార్యకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం మే 13న విడుదల కావాల్సి ఉంది. కానీ తాజాగా వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తే ఆచార్య రిలీజ్‌ డేట్‌ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెల రోజులకు పైగా వెనక్కి జరిగినట్లు సమాచారం. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌ ఆలస్యంకావడంతో ఇప్పుడు షెడ్యూల్‌ ప్రకారం విడుదల చేయడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆచార్య చిత్రాన్ని జూన్‌ 18న విడుదల కానున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు