Home సినిమాలు అనుకున్న తేదీకే చిరు వస్తున్నాడు.. ‘ఆచార్య’ షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం!

అనుకున్న తేదీకే చిరు వస్తున్నాడు.. ‘ఆచార్య’ షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప‌వ‌ర్ ఫుల్ మెగా ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం ‘ఆచార్య’‌. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్, పూజా హెగ్డే క‌థానాయిక‌లు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లపై నిరంజ‌న్ రెడ్డి, రామ్ చ‌ర‌ణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆచార్య’ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటుంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఒక షెడ్యూల్ పూర్తిచేయగా.. తాజాగా ఖమ్మంలో కూడా ఓ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ పూర్తిచేసింది.

అయితే ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో జరిగిన షెడ్యూల్ లో చిరంజీవి అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో.. చిత్రయూనిట్ అధికారికంగా సినిమా షూటింగ్‌ వివరాలను తెలియజేశారు. చిరంజీవి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని స్పష్టం చేసింది. ఖమ్మం, రాజమండ్రి షెడ్యూల్‌ను సైతం విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది. నెల రోజుల షూటింగ్‌లో చిరంజీవి, చరణ్‌ మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపింది. ఇక మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 13న విడుదల కానుంది. 

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు