Home ప్రత్యేకం అదీ అల్లు అర్జున్ రేంజ్‌: 'పుష్ప' కోసం షాకింగ్ రెమ్యున‌రేష‌న్

అదీ అల్లు అర్జున్ రేంజ్‌: ‘పుష్ప’ కోసం షాకింగ్ రెమ్యున‌రేష‌న్

అల్లు అర్జున్.. ఈ పేరును ప్రతీక్షణం జపించే అమ్మాయిలు ఎందరో.. అబ్బాయిలకైతే ఈ పేరు వింటేనే ఎక్కడ లేని జోష్ వస్తుంది. ఈ స్టైలిష్ హీరో ‘పుష్ప’ చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. దేశవ్యాప్తంగా బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం పుష్ప షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన తన రెమ్యునరేషన్‌ను విపరీతంగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, ‘పుష్ప’ సినిమా కోసం అల్లు అర్జున్‌ రూ.35 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం. అలాగే డైరెక్టర్ సుకుమార్‌ రూ.25 కోట్లు, ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న మలయాళ హీరో ఫహద్‌ ఫాజిల్‌ రూ.5 కోట్లు, హీరోయిన్‌ రష్మిక మందన్నా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదిలాఉంటే.. బన్నీ-సుకుమార్‌ కాంబోలో ఇప్పటికే ‘ఆర్య’, ‘ఆర్య-2’ సినిమాలు వచ్చి భారీ విజయాలు సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ కావడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రిమూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు