Home ప్రత్యేకం అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఉపాసన కొణిదెల.. మెగా కోడలుకు అరుదైన గౌరవం

అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఉపాసన కొణిదెల.. మెగా కోడలుకు అరుదైన గౌరవం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ గ్రూపుల చైర్‌పర్సన్‌  ఉపాసన సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారనే సంగతి తెలిసిందే. వ్యాపార వ్యవహారాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఉపాసన సామాజిక సేవ కోసం కూడా ప్రతీరోజు కొంత సమయాన్ని కేటాయిస్తుంటారు. పేదలకు తనవంతు సాయాన్ని అందిస్తుంటారు. అలాగే, సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌కు అవగాహన కల్పిస్తుంటారు. అయితే వ్యాపారవేత్తగా, సామాజిక సేవకురాలుగా ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న ఉపాసన కొణిదెలకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఉపాసన ఎంపికైంది. ఎఫ్ఎల్ఓ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) మహిళా విభాగం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ నుంచి ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఉపాసనను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ‘త‌న భార్య‌, త‌ల్లి, సోద‌రి, కూతురు, కోడ‌లు, మ‌న‌వ‌రాలి జీవితాల్లో వెలుగులు నింపే ప్ర‌తి పురుషుడికి ఈ అవార్డును అంకిత‌మిస్తున్నాను’ అని ఉపాసన పేర్కొంది.

అలాగే ‘ఈ అవార్డు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నా కుటుంబ సభ్యుల చేయూత, సహకారం, ప్రోత్సాహమే నాలో ఇన్ని అడుగులు వేయగలిగే ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నాతోపాటు ఉండి, నన్ను నడిపిస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు’ అని చెబుతోంది ఉపాసన.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు