అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. పూజా హెగ్డే కథానాయిక. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. జూన్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యువతరానికి నచ్చే అంశాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బ్యాచ్‌లర్‌గా అఖిల్ చేసే సందడి ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలాఉంటే.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున సంచలన కామెంట్స్ చేశారు. తన సొంత నిర్ణయాలు ఆలోచించి తీసుకునేంత పరిపక్వత అఖిల్ కు ఉంది కాబట్టి తన సినిమాల ఎంపిక, కథ విషయంలో ఎటువంటి సలహాలు ఇవ్వడం లేదని వెల్లడించాడు. అలాగే తనకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సంబంధించిన స్క్రిప్ట్ కూడా తెలియదని చెప్పాడు. ఈ నేపథ్యంలో అఖిల్ కెరీర్ గురించి ప్రస్తావిస్తూ అతి ముఖ్యమైన విషయం ఏమంటే అఖిల్‌ను హీరోగా ప్రేక్షకులు అంగీకరించారు అది వాడికి లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంక విజయం సాధించడానికి ముందు కొంత సమయం పడుతుంది అని నేను భావిస్తున్నాను అని నాగార్జున అన్నారు.