Home సినిమాలు అఖిల్‌ అక్కినేని లేటెస్ట్‌ మూవీ ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ ఆరోజే

అఖిల్‌ అక్కినేని లేటెస్ట్‌ మూవీ ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ ఆరోజే

యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ తెరకెక్కుతున్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం షరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్‌19న విడుదల కానుంది

కాగా, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రం తర్వాత అఖిల్‌ నటించనున్న కొత్త సినిమా ఇప్పటికే ఖరారైంది. అఖిల్ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మించనున్నారు. హీరోయిన్ గా సాక్షి వైద్య నటించనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు చివరి దశకు చేరుకోవడంతో.. ఇప్పుడీ సినిమాను ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ వారంలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌ వేదికగా ‘ఏఎస్‌ లోడింగ్‌’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే ఈ వారంలోనే ఈ సినిమా టైటిల్‌తో పాటు అఖిల్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు