Home ప్రత్యేకం 'అఖండ': కళ్లు చెదిరిపోయే రేటుకు ఓటీటీ రైట్స్‌!

‘అఖండ’: కళ్లు చెదిరిపోయే రేటుకు ఓటీటీ రైట్స్‌!

సింహా,లెజెండ్‌ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడో చిత్రం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌గ్యా జైస్వాల్ క‌థానాయిక‌గా నటిస్తుండగా.. పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవల ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా టీజర్ ను చిత్రబృందం విడుదల చేయగా.. యూట్యూబ్ లో పెను సంచనం సృష్టించింది.

ఇదిలాఉంటే.. మే 28న విడుద‌ల కానున్న ఈ చిత్రం ఓటీటీ డీల్ సహా శాటిలైట్ డీల్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. మాటీవీ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకోగా.. హాట్ స్టార్ ఓటీటీ హక్కుల్ని చేజిక్కించుకుంది. ఓటీటీ రైట్స్‌ను హాట్ స్టార్ భారీ మొత్తంకు ద‌క్కించుకుంద‌ని ఇన్‌సైడ్ టాక్. అఘోరా గెటప్ బాలయ్య ఆహార్యం పీక్స్ కు చేర‌డంతో డీల్‌పై భారీ హైప్ పెరిగింది. కాలుదువ్వే నంది ముందు రంగు మార్చే పంది.. కారు కూతల కూస్తే కపాలం పగిలిపోద్ది అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ చెప్తూ.. టీజర్లోనే విలన్లను బంతుల్లా ఎగరేశాడు.. బ్యాగ్రౌండ్‌లో తమన్ వేసిన దరువు ‘అఖండ’.. అఖండ విజయం సాధించేట్టుగానే కనిపిస్తుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు