Home సినిమాలు ‘అఖండ’నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్.. 'బాలయ్య ' వేట వికారాబాద్ అడవుల్లో..

‘అఖండ’నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్.. ‘బాలయ్య ‘ వేట వికారాబాద్ అడవుల్లో..

సింహా,లెజెండ్‌ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో చిత్రంగా ‘అఖండ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 13 ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ‘అఖండ’గా ఖరారు చేస్తూ టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ‘అఖండ’ టైటిల్‌ రోర్‌ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘అఖండ’ సినిమా వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటోందని తెలుస్తోంది.
దర్శకుడు బోయపాటి శ్రీను వికారాబాద్ అటవీప్రాంతంలో బాలయ్య, శ్రీకాంత్ లపై భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. అంతకుముందు ‘లెజెండ్’ చిత్రంతో జగపతి బాబును పవర్ ఫుల్ విలన్‌గా పరిచయం చేసిన బోయపాటి ‘అఖండ’తో శ్రీకాంత్ ను విలన్ గా పరిచయం చేయబోతున్నారు. కాగా, ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కథానాయికగా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు