Home సినిమాలు 'అఖండ'గా బాలయ్య గర్జన.. ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న పవర్ ప్యాక్డ్ టీజర్

‘అఖండ’గా బాలయ్య గర్జన.. ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న పవర్ ప్యాక్డ్ టీజర్

‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకి ‘అఖండ’అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. అలాగే టీజర్‌ని కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ ‘అఖండ’ టైటిల్‌ రోర్‌ నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.

‘అఖండ’ టైటిల్‌ రోర్‌ విడుదలైన కేవలం 24 గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకొని 250k లైక్స్ తో సోషల్ మీడియాలో నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌గా దూసుకెళ్తుంది. ఈ టీజర్లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌లు అభిమానులతో పాటు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కాగా, ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌గ్యా జైస్వాల్ క‌థానాయిక‌.  తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా  మే 28న విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు