Home సినిమాలు అక్కినేని ఫ్యామిలీ మరో మల్టీస్టారర్‌.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున!

అక్కినేని ఫ్యామిలీ మరో మల్టీస్టారర్‌.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున!

‘మనం’ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలసి నటించిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌.. ఇలా అక్కినేని హీరోలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని కథానాయకులకు, వాళ్ల అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.

అయితే  అక్కినేని హీరోలందరూ మరోసారి ఓ సినిమా చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. తాజాగా నాగార్జున కూడా దీనిపై కీలక ప్రకటన చేశారు. ఇటీవల తాను నటించిన  వైల్డ్‌డాగ్ మూవీ ఓటీటీ విజయం సాధించడంపై నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో తాను అఖిల్ కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చేస్తున్నామని.. కరోనా పరిస్థితులు అనుకూలించిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం నాగార్జున, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కరోనా కేసుల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు