అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. పూజా హెగ్డే కథానాయిక. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తాజాగా అక్కినేని అభిమానులకు మరో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది చిత్ర బృందం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం నుంచి కొత్త లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పోస్టర్ లో అఖిల్ సరికొత్త లో అదరగొడుతున్నాడు. కండలు తిరిగిన దేహంతో మగువల మనసుల్ని దోచేలా అఖిల్ కనిపిస్తున్నాడు. కాగా, శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను జూన్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.