Home సినిమాలు అక్కినేని అభిమానులకు స్పెషల్ కిక్.. మరోసారి జోడీగా నాగచైతన్య- సమంత!

అక్కినేని అభిమానులకు స్పెషల్ కిక్.. మరోసారి జోడీగా నాగచైతన్య- సమంత!

నాగచైతన్య – విక్రమ్‌ కె.కుమార్‌ కలయికలో ‘థ్యాంక్యూ’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చైతూ ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే ఈ సినిమాలో చైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు. గతంలో మజిలీ సినిమాలో క్రికెటర్‌గా కనిపించి మెప్పించాడు. 

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. సినిమాలో చైతూ భార్య సమంత అక్కినేని కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుందని  సమాచారం. పెళ్లి తర్వాత ఈ జోడీ ‘మజిలీ’లో నటించి విజయాన్ని అందుకున్నారు. ‘థ్యాంక్‌ యూ’ కథ నచ్చడంతో చైతూ, సమంత నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ‘మనం’ తర్వాత నాగచైతన్య – విక్రమ్‌ కె.కుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే.కాగా..టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. థాంక్యూ సినిమాని 2021 చివర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు