Home సినిమాలు అందరి చూపు ఎన్టీఆర్ మాస్క్ వైపే.. ఎందుకో తెలుసా?

అందరి చూపు ఎన్టీఆర్ మాస్క్ వైపే.. ఎందుకో తెలుసా?

ఇటీవల టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ ఇంట్లో ఓ వేడుక జరిగిన విషయం తెలిసిందే. అందరూ ఆ వేడుక గురించి చర్చిస్తుంటే.. కొందరు మాత్రం ఆ కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన ధరించిన మాస్క్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అది సాదాసీదా మాస్క్ కాదని, చాలా ఖరీదైనదని పేర్కొంటున్నారు.

ఇటీవల సుకుమార్ కూతురి  ఫంక్షన్‌కు ఎన్టీఆర్ కుటుంబంతో సహా హాజరైన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి వచ్చినపుడు ఎన్టీఆర్ ధరించిన మాస్క్ ధర ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ యూఎస్ స్పోర్ట్స్ బ్రాండ్‌కు చెందిన ఆ మాస్క్ ధర 2340 రూపాయలట. అంత ఖరీదైన మాస్క్ ఎన్టీఆర్ ధరించడంతో అలాంటి మాస్క్ లు కొనేందుకు ఆయన అభిమానులు కూడా ప్రయత్నిస్తున్నారట. ఇక ఎన్టీఆర్‌ ధరించిన మాస్క్‌ వైరల్‌ కావడంతో ఆ కంపెనీకి కూడా ఫ్రీగా ప్రమోషన్‌ వచ్చేసింది. గతంలోనూ రాజమౌళి కుమారుని పెళ్లికి హాజరైన ఎన్టీఆర్‌  25 ల‌క్ష‌ల వాచ్,  75 వేల ఖ‌రీదు ఉన్న షూస్ ధ‌రించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇటు బుల్లితెరపై కూడా హోస్ట్‌గా సందడి చేయడానికి ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. జెమినీలో ప్రసారం కానున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవరిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో త్వరలోనే విడుదల కానుంది. కాగా, ఈ షో  కోసం ఎన్టీఆర్ మొత్తం 60 ఎపిసోడ్‌లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు‌ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు తమ హీరోను బుల్లితెరపై కనులారా చూసుకునేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు