Home ప్రత్యేకం అంతరిక్షంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఇస్రో.. మొదలైన పీఎస్‌ఎల్వీ కౌంట్‌డౌన్‌

అంతరిక్షంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఇస్రో.. మొదలైన పీఎస్‌ఎల్వీ కౌంట్‌డౌన్‌

అంతరిక్షంలో సరికొత్త అధ్యాయానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తెరలేపింది. ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో తొలి అంతరిక్ష ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది. ఆదివారం చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ -సీ51 ప్రయోగంతో వాణిజ్యరంగంలో తొలి అడుగు వేయనుంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహా ప్రయోగ వాహకనౌక-సీ51 (పీఎస్‌ఎల్వీ)ను అంతరిక్షంలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఈరోజు ఉదయం 8.54 గంటలకు ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ దాదాపు 25 గంటలపాటు నిరంతరాయంగా సాగిన అనంతరం వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ ద్వారా  బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా-1తోపాటు మనదేశానికి చెందిన 18 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. 

ప్రభుత్వ రంగసంస్థ న్యూస్పేస్‌ ఇండియా వాణిజ్య ఒప్పందం మేరకు ఇస్రో తొలిసారి ఈ రాకెట్‌ ద్వారా ప్రైవేట్‌ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. బ్రెజిల్‌కు చెందిన 637 కిలోల భూపరిశీలన ఉపగ్రహం అమెజోనియ-1తో పాటు మరో 18 బుల్లి ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేయనున్నారు. ఇందులో అమెరికాకు చెందిన స్పేస్‌బీస్‌ ఉపగ్రహాలు 12, ఎస్‌ఏఐ-1 నానో కనెక్టివిటీ-2 ఉపగ్రహం, మన దేశానికి చెందిన డీఆర్‌డీవో ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన సింధునేత్ర ఉపగ్రహం ఉన్నాయి. అలాగే స్పేస్‌కిడ్జి ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన నానో ఉపగ్రహం సతీష్ ధవన్‌శాట్‌, శ్రీపెరంబుదూరు విద్యార్థుల జేఐటీశాట్‌, నాగపూర్‌ విద్యార్థుల జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌, కోయంబత్తూరు విద్యార్థుల శ్రీశక్తిశాట్‌లను కూడా కక్ష్యల్లోకి వదిలిపెట్టనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు